శంఖ మహర్షి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శంఖ మహర్షి,

అది బాహుదా నదీ తీరం. ఆ నదీ తీరాన ఒక బ్రాహ్మణుడు జీవిండేవాడు.ఆయన భార్య ఇరువురు కుమారులను కన్నది. వారికి తల్లిదండ్రులు శంఖుడని, లిఖితుడని నామకరణం చేశారు. ఇద్దరిని గారాబంగా పెంచుకుంటున్నారు.అన్నదమ్ములిద్దరూ శుక్లపక్ష చంద్రుని వలె పెరిగి పెద్దవారౌతున్నారు.తండ్రి ఇద్దరికి ఉపనయనం చేశాడు.వేదాంగ పారగులను చేశాడు.అంతవారి రువురు బాహుదా నదీ తీరాన ఆశ్రయములు నిర్మించుకొని బ్రహ్మచర్య దీక్షతో తపస్సు ప్రారంభించారు. దివ్వ శక్తియుక్తులు సంపాందించారు.వారు అసత్యమాడరు. ఆధర్మం చేయరు. శంఖలితులు అన్యోన్యంగా జీవిస్తున్నారు.

మామిడి పండు తినుట

[మార్చు]

లికితుడు శంఖుని ఆశ్రమానికి వచ్చాడు. ఆ సమయాన శంఖుడు ఆశ్రమమందు లేడు.అన్నరాకకై ఎదురుచూచుచూ లిఖితుడు రెండు మామిడిపండ్లు కోసికొని తినుచుండగా శంఖుడు వచ్చి లిఖితుని పలకరించాడు.లిఖితుడు ఫలములారగించి కాలు చేతులు శుభ్రం చేసికొని అన్నవద్దకు వచ్చాడు. ఫలములు తింటినని పలికాడు.విన్న శంఖుని మనస్సు చివుక్కుమన్నది. తమ్ముడు చేసిన పని అధర్మమని చెప్పాడు.అధర్మమని, చౌర్యదోష మంటునని పలికాడు.

లిఖితుని ప్రాయశ్చితము

[మార్చు]

లిఖితుడు భయభ్రాంతుడై ప్రాయశ్చిత్తం తెలుపమన్నాడు. దొంగతనం చేసిన నీ హస్తములు నరుకుకొనుటయే ప్రాయశ్చిత్తం వేరు మార్గం లేదు.అదీ ప్రభువులు శిక్షించాలి వెళ్ళి నుద్యుమ్నుని చేత దండనమనుభవించి పవిత్రుడవై తిరిగిరా అని పలుకగా లిఖితుడు ప్రభువులు దర్శించి విషయమంతాయూ చెప్పి శిక్ష విధించమని అర్ధించాడు. రాజు వారించ ప్రయత్నించాడు.లిఖితుడు ఊరకోనలేదు.చివరకు లిఖితుని రెండు చేతులు ఖండించాడు.లిఖితుడు అనందంతో అన్న వద్దకు చేరి జరిగిన విషయం చెప్పి శిక్ష అనుభవించానని పలికాడు.

పంచమహా పాతకములు

[మార్చు]

తమ్ముని చూచి శంఖుడు నాయనా విను కల్లు త్రాగుట, గురువు గారి భార్యను సంభోగించుట, ద్విజుని సంహరించుట, బ్రహ్మజ్ఞాని యింట దొంగతనం చేయుట, పై వాటిని ప్రోత్సహించుట పంచ మహాపాతకములు.వీటిని చేసిన దండనార్హుడే నీకు శిక్ష అనుభవించావు.పరమపూజ్యుడవయ్యావు. నాకు అనందంగా వుంది అని మౌనం వహించాడు.

లిఖితుని పాపవిమోచనము

[మార్చు]

లిఖితుడు బాహుదా నదిలో స్నానం చేసి బయటకు వచ్చుసరికి అతనికి చేతులు వచ్చాయి.దివ్వకాంతితో వెలుగుతున్నాడు.అన్న పరమానంద భరితుడే అయ్యాడు.తమ్ముని కౌగలించుకున్నాడు. ఇరువురును ఎవరి ఆశ్రమమునుకు వారు వెళ్ళి పోయారు. అన్నదమ్ములిద్దరి పేర నాలుగు స్మ ృతులు విరాజిల్లుచున్నాయి

వెలుపలి లింకులు

[మార్చు]